మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ల పదవీ బాధ్యతలు స్వీకరణ.
స్వాతి,వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమీక్షంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు
బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన దావ స్వాతి,వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమీక్షంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ముందుగా ఎమ్మెల్యేకు మున్సిపల్ కమిషనర్,వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ లను ఎమ్మెల్యే శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు నూతన కౌన్సిలర్ లు వార్డుల్లో తిరుగుతు ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు.ఫీల్డ్‌లో ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుందని,ప్రతి కౌన్సిలర్ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.పట్టణ ప్రగతికి అందరు కలిసి కట్టుగా పని చేయాలని తెలిపారు.అదేవిధంగా స్థానిక నాయకులు పలువురు మాట్లాడుతు కాంగ్రెస్ లో ఉంటు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన కొంతమంది నాయకులను గుర్తించి పార్టీ నుండి సస్పెండ్ చేసి వారికి తగిన శాస్తి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన వారిని గుర్తించి వారిని వెలివేసినట్లయితే భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమనికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్ లను,మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్ లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య,టిపిసిసి ఓబిసి సెల్ స్టేట్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్,నాయకులు నర్సింగరావు,చిలుముల శంకర్,దావ రమేష్,బండి లక్ష్మణ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
