విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సాప్ చాట్ బాట్: ఎన్పీడీసియల్ ఎస్ఈ వెల్లడి.

​వినియోగదారుల ముంగిటకే విద్యుత్ సేవలు 7901628348 నంబర్‌కు హాయ్ అని పంపితే చాలు.

ఖమ్మం :లోకల్ గైడ్ :
 విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చిందని ఖమ్మo 
 సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ ఇనుగుర్తి శ్రీనివాస చారి 
  తెలిపారు. వినియోగదారులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ నుండే వాట్సాప్ చాట్ బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
​ఫిర్యాదు నమోదు చేసే విధానం:
​వినియోగదారులు తమ మొబైల్ నుండి 7901628348 నంబరుకు వాట్సాప్‌లో ‘హాయ్ ’ అని మెసేజ్ పంపాలి.
​వెంటనే ‘హాయ్.. ఎన్పీడీసీఎల్  కాల్ సెంటర్ కు స్వాగతం’ అనే సందేశంతో పాటు రిజిస్టర్ కంప్లైంట్ , ట్రాక్స్ కంప్లైంట్స్ , చాట్ విత్ ఏజెంట్ అనే ఆప్షన్లు వస్తాయి.
​రిజిస్టర్ కంప్లైంట్స్ ఎంచుకున్నాక, మీ విద్యుత్ కనెక్షన్ (యూనిక్యూ సర్వీసెస్ నెంబర్ ) వివరాలతో లేదా వివరాలు లేకుండా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
​సర్వీస్ నంబర్ నమోదు చేయగానే వినియోగదారుని వివరాలు కనిపిస్తాయి. వాటిని నిర్ధారించాక (ఓకే చేశాక), మెనూలో సమస్య రకాన్ని ఎంచుకోవాలి.

​త్వరితగతిన పరిష్కారం, పారదర్శకత:
ఫిర్యాదు నమోదు కాగానే ఒక కంప్లైంట్ ఐడి (ఐడి ) జనరేట్ అవుతుంది. ఈ సమాచారం వెంటనే సంబంధిత అధికారికి నివేదించబడుతుంది. ఫిర్యాదు పరిష్కారమయ్యాక వినియోగదారునికి సందేశంతో పాటు ఇవర్స్ ద్వారా కాల్ వస్తుందని ఎస్ఈ వివరించారు. ఒకవేళ పరిష్కారంపై సంతృప్తి చెందకపోతే, తిరిగి ఫిర్యాదును రీ-ఓపెన్ చేసే అవకాశం లేదా ఫీడ్ బ్యాక్ ఇచ్చే సౌకర్యం కూడా కల్పించామన్నారు.
​అదనపు సమాచారం:
వినియోగదారులు ఎన్పిడిసిఎల్ అధికారిక వెబ్ సైట్ డబ్ల్యూ డబ్ల్యూ .టీజీనపీడీసీల్ . సి ఓ ఎం  లోని వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేసి కూడా ఈ సేవలు పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1912 ను కూడా సంప్రదించవచ్చని ఆయన కోరారు. సాంకేతికతను అందిపుచ్చుకుని మెరుగైన సేవలు అందించడమే సంస్థ లక్ష్యమని ఎస్ఈ స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ