కరుణగిరి యూత్ క్రికెట్ టోర్నీ బ్రోచర్ ఆవిష్కరించిన ఎంపీ  రామసహాయం రఘురాం రెడ్డి


 ఖమ్మం :లోకల్ గైడ్
ఖమ్మం: కరుణగిరి యూత్ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుంచి పాలేరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్‌ను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పోటీలు కేంద్రీయ విద్యాలయ రోడ్ మైదానంలో జరుగనున్నాయి.
టోర్నీ నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ యువనేత ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో ఎంపీని వారి నివాసంలో కలసి బ్రోచర్‌ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్ల నిర్వహణ అవసరమని పేర్కొంటూ..పోటీలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ  అభినందించారు. ఈ కార్యక్రమంలో.. టోర్నీ నిర్వాహకులు అక్కిరాజు నరేష్, పీ.సంపత్, జి. శ్రీకాంత్, నాయుడు, పవెల్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
    లోకల్ గైడ్:  చౌదరిగూడ జిల్లేడు చౌదరిగూడ మండలం,  ఎలుకగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ శుభ్రత మరియు
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ళ
మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్