ప్రకృతి విపత్తుల సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు పై నిర్వహించిన
ముందస్తు మాక్ డ్రిల్ ను పర్యవేక్షించిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
By Ram Reddy
On
లోకిల్ గైడ్ కామారెడ్డి ప్రతినిధి మర్చి 25
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విపత్తు సమయంలో సమన్వయం, తక్షణ స్పందన, ప్రజల అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. మాక్ డ్రిల్ ద్వారా ప్రజల రక్షణపై అవగాహన
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఎలా సురక్షితంగా రక్షించాలో తెలియజేయడానికి National Disaster Response Force (NDRF) బృందాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని
మాక్ డ్రిల్‌ల ద్వారా ప్రజల్లో అప్రమత్తత పెంపొందించడం ముఖ్యమని తెలిపారు. విపత్తు సంభవించినప్పుడు భయపడకుండా, సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గించవచ్చని ఆయన అన్నారు.
మాక్ డ్రిల్ ద్వారా కలిగిన అవగాహన:
ప్రమాద సమయంలో వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలే విధానం
వరదలు, తుఫానుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిక్కుకుపోయిన వారిని రక్షించే పద్ధతులు
అత్యవసర సేవలను ఎలా సంప్రదించాలి అనే సమాచారం
గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించే విధానం తదితర వాటి పై అవగాహన, ఇటువంటి మాక్ డ్రిల్‌లు ప్రజలకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించి, విపత్తుల సమయంలో సమర్థంగా స్పందించే సామర్థ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించడం ద్వారా తమ ప్రాణాలను, ఆస్తులను రక్షించుకోవచ్చని సూచించారు. . ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ రక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇటువంటి మాక్ డ్రిల్‌ల ద్వారా ప్రజలకు , అధికారులకు విపత్తు సమయంలో ఎలా స్పందించాలో స్పష్టమైన అవగాహన కలుగుతుందని తెలిపారు.
అలాగే National Disaster Response Force (NDRF) బృందాలు వేగవంతంగా స్పందించి ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, విపత్తుల సమయం లో ఎలా ఎదుర్కోవాలో ముందుగానే అవగాహన కలిగివుండి అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. .. ఈ మాక్ డ్రిల్ లో అదనపు కలెక్టర్ విక్టర్, adl SP చైతన్య రెడ్డి, dipti కమాండర్ డోల్ సింగ్, NDR బృందం, జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్, RDO వీణ , తహసిల్దార్ హిమబిందు వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ..
Tags:
About The Author
Latest News
07 Apr 2026 21:11:31
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07 లోకల్ గైడ్
వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
