ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 8 :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదిప్ దూరిశెట్టి ప్రతిష్టమ్మకంగా చేపట్టిన, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రామ్ లో భాగంగా కారేపల్లి మండలం లోనీ మాదారం గ్రామ పంచాయతీ గోవిందుతండా గ్రామం నందు విధుల్లోని పరిసరాలను, చెత్త చెదారం, ముళ్ల పొదలను సర్పంచ్ అజ్మీరా ఉమారాణి , స్థానిక ఎం పీ డీ వో పీ. శ్రీనివాసరావు పంచాయతీ సిబ్బంది తో కలిసి శుభ్రం చెయ్యడం జరిగింది. గ్రామ విధులు శుభ్రంగా ఉంటేనే పల్లెలకు అందం వస్తుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక్కలే కాకుండా ప్రతీ ఒక్క పౌరుడు విధిగా శుభ్రతల విషయంలో పాలుపంచుకోవాలని, పట్టణాలు పల్లెల వైపు చూసేవిధంగా గ్రామ పంచాయతీ లను తీర్చిద్దిదుకోవాలని ప్రతి రోజు విధిగా చెత్త ట్రాక్టర్ ను గ్రామాల్లో చెత్త కలెక్షన్ చేసుకొని డంపింగ్ యార్డ్ కు తరలించి చెత్తను తడి పొడి గా వేరుచేసి కాల్చి వెయ్యాలని ఇరువురు గ్రామ ప్రజలకు, పంచాయతీ పాలకవర్గం సభ్యులకు, సిబ్బంది కీ తెలియజేసినారు. సర్పంచ్ అజ్మీరా ఉమారాణి మాట్లాడుతూ పంచాయతి సిబ్బంది కీ హెచ్చరికలు జరిచేస్తూ ప్రతీ రోజు గ్రామ విధుల్లోని ప్రతీ గుమ్మమ్ ముందు ట్రాక్టర్ ను నిలిపి చెత్త ఉందమ్మా అంటూ మందాలించాలని , ఇండ్ల చూటుపక్కల ఆపరిశుభ్రంగా చెత్తతో ఉంటే వెంటనే కుటుంబ సభ్యులకు తెలియపర్చీ మరలా పునరావృతం కాకుండా గ్రామ పంచాయతీ రహదారులను అందంగా తీర్చిద్దిద్దే బాధ్యత మన అందరిమీద ఉందాని పంచాయతీ ప్రజలకు, పాలకవర్గ సిబ్బంది కీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం మాదారం కాంగ్రెస్ పార్టీ యూవ నాయకుడు అజ్మీరా నరేష్, ఉపసర్పంచ్ మంగ లాల్, వార్డ్ నంబర్ సౌందర్య నగేష్ , బానోత్ కోటి, వంకుడోత్ వీరన్న తదితరులు పాల్గొనడం జరిగింది.