మొక్కజొన్న విత్తన కంపెనీల మోసంతో పంటకు నిప్పు పెట్టిన గిరిజన రైతులు

 -మొక్కజొన్న కంపెనీలపై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలి

మొక్కజొన్న విత్తన కంపెనీల మోసంతో పంటకు నిప్పు పెట్టిన గిరిజన రైతులు

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ

 

 

 -

ఖమ్మం జిల్లా, కామేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 09 :

జిల్లాలో మొక్కజొన్న  విత్తన కంపెనీల  ఆర్గనైజేర్లు , మధ్యవర్తుతుల  ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ అన్నారు.
రబీ  వ్యవసాయ సీజన్లో  రైతులకు మొక్కజొన్న విత్తన కంపెనీలు విత్తనాలు సరఫరా చేసి, పంట కొనుగోలు చేస్తామని ,ముందస్తుగా ఎకరాకు 20,000 అడ్వాన్సుగా ఇస్తామని  క్వింటాలకు 3300 ధర చెల్లిస్తామని, అవసరమైన పురుగుమందులు ఎరువులు సరఫరా చేస్తామని రైతులను నమ్మించి విత్తన మొక్కజొన్న సాగు చేయుచి , రైతులకు ముందస్తుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రైతులు శ్రమపడి పంట పండిచిన తీరా పంట చేతికి వచ్చేసరికిIMG-20260409-WA0125 కంపెనీలు చేతులెత్తేసి రైతులను ముంచు తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఉపాధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కామేపల్లి మండలం హరిచంద్ర పురం శ్రీరాం నగర్ తండాలో   విత్తన మొక్కజొన్న కంపెనీల చేతిలో మోసపోయి పంట నిప్పు పెట్టిన రైతులు పంట పొలాలను తెలంగాణ రైతు సంఘం బృందం పరిశీలించింది.
 ఇట్టి విషయంపై మంగళవారం నాడు రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అను దీప్ కి ఫిర్యాదు చేసి ఉన్నారు,  గిరిజన రైతులు భూక్యా నగేష్, నాలుగు ఎకరాలు, భూక్యా కిషన్ మూడు ఎకరాల 150 రోజులు పంటను పశువుల విత్తన మొక్కజొన్న కంకులు పశువులు తింటే చనిపోయే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో వారం రోజుల క్రితం నిప్పు పెట్టారు , మరో ఇరవై ఐదు మంది రైతులు వంద ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. మొక్కజొన్న పంటను కాలబెట్టిన పంటను రైతు సంఘం పరిశీలించిన అనంతరం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఉపాధ్యక్షులు దుర్గ కృష్ణ మాట్లాడుతూ విత్తన కంపెనీలు సాగు చేసే సమయంలో రైతులకు మాయమాటలు చెప్పి పంట తరలించే నాటికి చేతులెత్తేయడంతో రైతులు తమ పంట పొలంలో ఎకరాకు 35 నుంచి 45 క్వింటాలు దిగుబడి వచ్చి కూడా కంపెనీలు ప్రతినిధులు వచ్చి మొక్కజొన్న కంకులు విరిపించకు విరిపించకపోవడంతో లక్షల రూపాయలు నష్టపోతున్నారని హరిచంద్రపురం శ్రీరామ్నగర్ తండాలో రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు జోక్యం చేసుకొని కంపెనీలను పిలిపించి రైతుల పంటను యుద్ధ ప్రాతిపదికను తరలించాలని డిమాండ్ చేశారు, ఖమ్మం జిల్లాలో రోజురోజుకీ మొక్కజొన్న ఇతర కంపెనీల ఆర్గనైజర్లు మధ్యవర్తులు  రైతులను మోసం చేయడం జరుగుతుందని అసలు కొన్ని కంపెనీలు ప్రభుత్వం గుర్తింపు కూడా లేకుండా చలామణి అవుతున్నాయని రైతుకు ముందస్తుగా ఎగ్రిమెంట్ ఇవ్వాల్సిన కంపెనీలు రైతుల ఆశలను సొమ్ము చేసుకుని మోసం చేస్తున్నాయని అన్నారు. విత్తన కంపెనీలో మూలంగా నష్టపోతున్న రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
భవిష్యత్తులో రైతులు కూడా అగ్రిమెంట్ లేకుండా కంపెనీల ఆర్గనైజేర్లు మధ్యవర్తుతుల మాటలు నమ్మి కంపెనీ విత్తనాలు సాగు చేయొద్దని సూచించారు

రైతు సంఘం బృందం స్థానిక వ్యవసాయ అధికారికి తెలియజేయడంతో మండల వ్యవసాయ అధికారి తారా దేవి ఏఈఓ నివేదిత తో కలిసి పంట పొలాలను పరిశీలించారు విత్తన కంపెనీలు ప్రతినిధులు కనీసం ఫోన్లు ఎత్తి సమాచారం కూడా ఇవ్వటం లేదని రైతులు వాపోయారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు సిఐటియు జిల్లా నాయకులు బాదవత్ శ్రీనివాసరావు, రైతులు లక్ష్మణ్, రాందాస్, శివ, భూక్యా బాబు, పద్మా బాధిత రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News