కీ"శే"చిన్నయ్యగారి గణేష్ జ్ఞాపకార్థకంగా..

బూర్గుల గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు..

కీ

ప్రారంభించిన బూర్గుల గ్రామస్థులు.. చలివేంద్రం ఏర్పాటుపై గ్రామస్థుల అభినందనీయం..

 లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలో బూర్గుల గ్రామంలో కీ"శే" చిన్నయ్యగారి గణేష్ జ్ఞాపకార్థకంగా బస్సు స్టాండ్ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని గ్రామస్థులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామంలో పలువురు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నయ్యగారి గణేష్ జ్ఞాపకార్థంగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన అతని కుటుంబ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల గ్రామ పెద్దలు హర్షనీయం వ్యక్తం చేసారు.ఈ చలివేంద్రాన్ని బాటసారులు, బూర్గుల గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలకు, ప్రయాణికులు, వ్యాపారస్తులకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News