ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న పత్రిక లోకల్ గైడ్ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
లోకల్ గైడ్ దిన పత్రిక కేలండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మరియు లోకల్ గైడ్ దిన పత్రిక ఎండి చిలకామర్రి రాంరెడ్డి

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న పత్రిక లోకల్ గైడ్ దినపత్రిక అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే తన క్యాప్ కార్యాలయంలో లోకల్ గైడ్ తెలంగాణ పత్రిక ఎండి చిలకామర్రి రాంరెడ్డి తో కలిసి క్యాxలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో షాద్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, మాజీ జడ్పీటీసీ వెంకట్ రామ్ రెడ్డి షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నయ్య, సీనియర్ నాయకులు ఎండి ఇబ్రహీం మరియు రంగారెడ్డి జిల్లా రిపోర్టర్ వెంకటేష్, రంగారెడ్డి జిల్లా యాడ్స్ మేనేజర్ శ్రీనివాస్,నియోజక వర్గం నరేందర్ నాయక్, చౌదరి గూడెం రిపోర్ట్ రాములు, కొందుర్గు రిపోర్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తూరు రిపోర్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు.
