లోకల్ గైడ్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా
తొలి స్వాతంత్ర సమరయోధుడుగా వడ్డెర ఓపన్నకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం సంతోషకరమని వడ్డెర స్టూడెంట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వడ్డెర దేవేందర్ అన్నారు. వడ్డెర ఓపెన్ ద జయంతిని పురస్కరించుకొని పట్టణ కూడలిపై ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు అన్ని కలెక్టరేట్లలో ఆయన జయంతి ఉత్సవాలను జరపడం సంతోషకరమన్నారు. అదేవిధంగా రవీంద్రభారతిలో మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. వడ్డెర ఓబన్న స్వాతంత్ర సమరంలో సైరా నరసింహారెడ్డి తో కలిసి పోరాడిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. ఎంతోమంది తెల్లదొరల ప్రాణాలను తీసి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహాయోధుడని కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. అయితే వడ్డెర కులాలను 14 రాష్ట్రాలలో ఎస్సీలుగా గుర్తించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. అదేవిధంగా వడ్డెర కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.. వడ్డే దేవేందర్ వడ్డే హనుమంతు వడ్డే శ్రీనివాస్ వడ్డే శీను వడ్డే రాజు వడ్డే నరేష్ వడ్డే రమేష్ వడ్డే ఆంజనేయులు వడ్డే యాదయ్య వడ్డే రాఘవేందర్ వడ్డే యాదయ్య వడ్డే స్వామి వడ్డే యాదయ్య గుడ్డే చంద్రయ్య వడ్డే కృష్ణయ్య వడ్డే మల్లయ్య వడ్డే నర్సింలు ఈ ప్రోగ్రాం లో తదితరులు పాల్గొని విజయవంతం చేశారు