లోకల్ గైడ్ కొత్తూరు.
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇండస్ట్రియల్ జోన్ లో ఏర్పాటుచేసిన ఎన్.ఆర్.ఎస్ ట్రాన్స్పోర్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్సీకి బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ..ఎన్.ఆర్.ఎస్ ట్రాన్స్పోర్ట్ అధినేత తుప్పర రవీందర్ ను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అభినందించారు.జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరు ఎదో ఒక పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్రోళ్ల లక్ష్మయ్య, తుప్పర గణేష్,రంజిత్,సాగర్, అనిల్,నాగేష్,శ్రీ వాస్తవ్, తదితరులు పాల్గొన్నారు.