గ్రామాల అభివృద్ధికి, ప్రజాసేవకు మరింత ప్రోత్సాహం.
షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్
లోకల్ గైడ్ : షాద్‌నగర్
గ్రామాల అభివృద్ధికి ప్రజాసేవకు మరింత సహకారం ప్రభుత్వం అందిస్తుందని షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ అన్నారు. సూపర్ కాటన్ గిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యజమాని మొహమ్మద్ వసీం (ఇక్బాల్ సాహెబ్ ) ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లకు ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాలు చంద్రబాబు, అజర్ అలీ (చౌడర్‌గూడ) ఆజమ్ పటేల్ (తుమ్మలపల్లి) రాములు యాదవ్ (లచ్చంపేట) వెంకటేష్ (ఎంకెపల్లి)
ఎ. కృష్ణయ్య, లక్ష్మీ రాములు (మొగిలిగిద్ధ) బెక్కం శశి (జిల్లెడ్)
శ్రీనివాస్ రెడ్డి (చిన్న ఉమెంటల్)
సందీప్ గౌడ్ (అప్పారెడ్డిగూడ)
ఈ కార్యక్రమానికి ఏఎంసీ మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ బంగారు రాములు, ఇబ్రాహీం, మహబూబ్ భాయ్, మాధవ రెడ్డి, అయూబ్, రియాజ్, విద్యాసాగర్, అబ్దుల్ సమద్, నదీమ్, ఆసిమ్, బంగారు అంజయ్య, తబ్రేజ్, అలీం పాషా తదితర ప్రముఖులు హాజరై నూతన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి, ప్రజాసేవకు మరింత ప్రోత్సాహం కలిగించేలా విజయవంతంగా జరిగింది.
