గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో సర్పంచులదే ముఖ్య పాత్ర
సర్పంచుల శిక్షణ కేంద్రంలో పాలన పరమైన అంశాలను తెలుసుకొన్నాను -ఎల్కగూడెం సర్పంచ్ చాకలి బందయ్య.
జిల్లేడు చౌదరి గూడెం, ( లోకల్ గైడ్ ): గ్రామాల పురాభివృద్ధిలో సర్పంచులదే ముఖ్యపాత్ర ఉంటుందని ఎలుకగూడెం సర్పంచ్ చాకలి బందయ్య తెలిపారు. శంషాబాద్ మండలం ముచ్చంతల్ లోని స్వర్ణ భారతిట్రస్ట్ లో షాద్ నగర్ నియోజకవర్గం సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణ అనంతరం అధికారులు సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చాకలి బంద య్య మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో గ్రామ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, సర్పంచ్ పాత్ర ఏమిటి, వార్డు సభ్యుల పాత్ర ఏమిటి, అధికారుల పాత్ర ఏమిటి అనే అంశాలను అధికారి క్లుప్తంగా వివరించాలని తెలిపారు. కుల మతాల కచ్చితంగా, రాజకీయాల కచ్చితంగా ఎలాంటి వర్గబేద తారతమ్యం లేకుండా గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారం, ప్రజల అండదండలతో గ్రామపంచాయతీలోని ప్రతి వార్డులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కల్పనకు తమ వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక వనరుల సమర్థ వినియోగం,పారిశుద్ధ్యం మౌలిక వసతుల ఏర్పాటులో ముందుండి ప్రజలను మెప్పించే విధంగా పనిచేస్తానని తెలిపారు.
