రహదారి భద్రతా మాసోత్సవాలు.

టీజీఎస్ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో

రహదారి భద్రతా మాసోత్సవాలు.

హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి07(లోకల్ గైడ్ ):

 శనివారం హన్మకొండ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రమాద రహితంగా సేవలు అందిస్తున్న ఉత్తమ డ్రైవర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఏసీపీ  నరసింహారావు  హాజరయ్యారు.
సంస్థలో సుదీర్ఘకాలంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సేవలు అందించిన ముగ్గురు డ్రైవర్లు రీజనల్ స్థాయిలో ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికయ్యారు. పరకాల డిపోకు చెందిన పి.డి.రెడ్డి, వరంగల్-1-డిపోకు చెందిన ఎస్.రమేష్, నర్సంపేట డిపోకు చెందిన పి. భాస్కర్ కు ఈ గౌరవం దక్కిందని అన్నారు. వీరిని వరంగల్ రీజనల్ మేనేజర్ డి. విజయ భాను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏసీపీ (ట్రాఫిక్) నరసింహారావు  మాట్లాడుతూ, రోడ్డు భద్రత విషయంలో డ్రైవర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చడం ఒక గొప్ప బాధ్యత అని పేర్కొంటూ,ప్రమాద రహితంగా సేవలు అందిస్తున్న డ్రైవర్లు ఇతరులకు ఆదర్శప్రాయులని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
వరంగల్ రీజనల్ మేనేజర్ డి. విజయ భానుమాట్లాడుతూ, సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి డ్రైవర్ కూడా ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాముఖ్యత గా తీసుకోవాలని సూచించారు. ప్రమాద రహితంగా సేవలు అందించిన డ్రైవర్లను సన్మానించడం ద్వారా ఇతరులకు ప్రేరణ కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో   కే భాను కిరణ్   డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్), వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల మేనేజర్లు,  ట్రాఫిక్ మరియు మెకానికల్ అధికారులు, సిబ్బంది పాల్గొని సన్మానం పొందిన డ్రైవర్లను అభినందించారు.

Tags:

About The Author

Latest News