ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

స్వయం పరిపాలన దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జడ్చర్ల జనవరి 9(లోకల్ గైడ్:

 మండలంలోని జెడ్.పీ.హెచ్.ఎస్ ఆలూరు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని, స్వయం పరిపాలన విధానంపై అవగాహన పెంపొందించుకున్నారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం అనుభవం ఎంతో సంతృప్తికరంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పరిపాలనా బాధ్యతలను స్వీకరించారు.
కృపాంజలి హెడ్‌మాస్టర్ (HM)గా, గాయత్రీ కలెక్టర్గా, కీర్తన ఆర్.జె.డి (RJD)గా, రాంచరణ్ తేజ్డీ ఈఓ (DEO)గా, దీపిక ఎంఈఓ (MEO)గా బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా మొత్తం 42 మంది విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపె లింగయ్య సర్పంచ్, మల్లేష్ యాదవ్ ఉప సర్పంచ్ హాజరయ్యారు. అలాగే శ్రీను, అహ్మద్ షరీఫ్, అబ్దుల్ అలీమ్, హరిహరనాథ్, హైమావతి, సంధ్య, సోమ్ల, మంజుల, విజయప్రతాప్, నిర్మల తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

కార్యక్రమం ముగింపులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించడంలో కీలకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి