మిర్యాలగూడ జనవరి 10
(లోకల్ గైడ్, తెలంగాణ )
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మిర్యాలగూడకు ప్రాధాన్యత ఇచ్చి మిర్యాలగూడను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి స్టీరింగ్ సభ్యులు,సామాజికవేత్త డాక్టర్ రాజు,మారం శ్రీనివాస్,మాలోత్ దశరథ్ నాయక్ కోరారు.శనివారం మిర్యాలగూడలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మిర్యాలగూడ జిల్లా చేయాల్సి ఉన్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యం దృష్ట్యా మిర్యాలగూడ జిల్లా రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. జిల్లా ఏర్పాటులో గతంలో జరిగిన తప్పిదాలను సవరించి అన్ని వనరులు,అర్హతలు ఉన్న మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరారు.జిల్లా సాధన కోసం గతంలో మిర్యాలగూడ,నాగార్జున సాగర్,హుజూర్ నగర్ నియోజకర్గంలో వివిధ రూపాలలో ఆందోళనలు చేసినట్లు చెప్పారు.ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీల నాయకులు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం హామి ఇచ్చారని వాటిని నెరవేర్చాలని కోరారు.జిల్లా ఏర్పాటు ఉద్యమానికి పూర్తి మద్దతు,సంఘీభావం తెలుపుతున్నట్లు సీపీఐ సూర్యాపేట కార్యవర్గ సభ్యులు, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూలిపాల ధనుంజయ నాయుడు తెలిపారు.జిల్లా సాధన కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు ,రాపోలు పరమేష్ ,ఖాజా హామీదొద్దిన్,అస్లాం,రంగా శ్రీనివాస్,యాదగిరి, మట్టయ్య,నానిక్య నాయక్,మక్లా నాయక్,జయరాజు, చంద్ర శేఖర్,తిరుపతయ్య,పరికే భరత్,కామరాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.