అయ్యా..మా బిడ్డ ప్రాణాలు కాపాడండి.

మూడు రోజుల నుంచి తిండి, నిద్ర లేమితో తీవ్ర ఇబ్బందులు. అరుదైన వ్యాధి "ఎస్ఎంఏ"తో బాధపడుతున్న బాలుడు. - రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇస్తేనే బ్రతికే ఛాన్స్.

అయ్యా..మా బిడ్డ ప్రాణాలు కాపాడండి.

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ పరిస్థితి. - తమ బిడ్డను బతికించాలని ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు. 

లోకల్ గైడ్/తాండూర్:
ఓ నిరుపేద కుటుంబానికి కొండంత ఆపద వచ్చి పడింది. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించే పేద తల్లిదండ్రులకు కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఆపద వచ్చి పడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి(లక్షలలో ఏ ఒకరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రూ.16 కోట్ల విలువచేసే ఇంజక్షన్ ఇస్తే తప్ప బ్రతికే అవకాశాలు లేవని జిల్లా వైద్యులు తెలపడంతో, ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం, బొంరాస్ పేట్ మండలం వడిచర్ల గ్రామ పరిధిలోని ఊరెనికి తాండకు చెందిన మూడవత్ శ్రీను, గోరిబాయ్ దంపతులకు మూడవత్ జగన్ అనే ఐదున్నర సంవత్సరాల బాలుడు(కొడుకు) ఉన్నాడు. అయితే బతుకు దెరువు కోసమని మూడు సంవత్సరాల క్రితం తాండూర్ వచ్చి సాయిపూర్ లో నివాసం ఉంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి జగన్ ఫిట్స్ తో బాధపడుతున్నాడు. ఇందుకోసం తిరగరాని ఆసుపత్రి తిరిగిన వ్యాధి నయం కాలేదు. ఈ నేపథ్యంలో వేల రూపాయలు అప్పు చేసి హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు.. బాలుడికి అరుదైన ప్రాణాంతక స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) వ్యాధి సోకిందని వెల్లడించారు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధి ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ లేదని, ఇది ఓ కొత్త రకమైన వైరస్ వల్ల సోకిందని తెలిపారు. ఈ వ్యాధి నయం కావాలంటే, జొల్జెన్స్మా  అనే ఇంజక్షన్ ఇవ్వాలన్నారు.దీన్ని అమెరికా నుంచి తెప్పించాలని, ఇందుకోసం రూ.16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

*అత్యవసర చికిత్స కోసం రూ.6 కోట్లు.*
ఎస్ఎంఏ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడికి నయం కావాలంటే వైద్యులు నాలుగు మాసాలా గడువు ఇచ్చారు. ఇప్పటికే మూడు నెలలు ముగిశాయి. ఇప్పుడు మిగిలింది కేవలం 20 రోజులు మాత్రమే. బాబు బ్రతకాలంటే రూ.6 కోట్ల ఇంజక్షన్ ఇవ్వాలి. లేకుంటే బాబు ప్రాణాలు కాపాడడం కష్టతరం. 

*ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.*
బాబు ప్రాణాలు కాపాడాలంటే మిగిలింది 20 రోజులు మాత్రమే. ఈ 20 రోజుల్లో ఏ క్షణం ఏమైనా జరగొచ్చు. ఓ నిండు ప్రాణాలు నిలబెట్టాలంటే తక్షణమే అమెరికా నుంచి ఇంజక్షన్ తెప్పించాలి. అందుకోసం ఆరు కోట్లు ఖర్చవుతుంది. పాపం! ఆ తల్లిదండ్రులు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చేయుతనందిస్తారని రోధిస్తున్నారు. దాతలు... అధికారులు,ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, ముఖ్యమంత్రి సైతం స్పందించి బాబుకు ఇంజక్షన్ ఇప్పించి ప్రాణా బిక్ష పెట్టాలని తల్లిదండ్రులు శ్రీను, గోరిబాయ్ ఎదురుచూస్తున్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి