రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పనితీరుపై అసహనం...

రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ.

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట,బెల్లంపల్లి,తాండూరు,నెన్నెల,వేమనపల్లి మండలాలకు చెందిన పలువురు వ్యవసాయ రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు రకాల పనిముట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు ముఖ్యఅతిథిలుగా హాజరై రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేశారు.రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలోని రైతులకు వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకై 2కోట్ల35లక్షలు మొత్తం జిల్లాలో 46లక్షలు వరకు వ్యవసాయ పనిముట్లు బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.వేమనపల్లికి చెందిన పి పూర్ణచందర్ రెడ్డి కి పవర్ జిల్లర్,కాసిపేట మండలానికి చెందిన కడారి రామారావుకు రోటోవేటర్,తాండూరు మండలానికి చెందిన దుగుట రామక్రిష్ణకు రోటవేటర్,పులిపెట్టి సత్తయ్యకు రోటోవేటర్ లు అందజేసారు.కాగా బెల్లంపల్లి నియోజక వర్గానికి 74లక్షల5వేలు కేటాయించగా ఇప్పటివరకు 81.59లక్షల విలువైన వివిద వ్యవసాయ పనిముట్ల కోసం బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.కాగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిపై ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు అసహనం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ,బెల్లంపల్లి,తాండూరు,వేమనపల్లి,నెన్నెల,కాసిపేట మండలాల ఎఓలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి