సీఎం కప్ పరేడ్ రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే 

 

అశ్వారావుపేట : లోకల్ గైడ్ : జనవరి8 : 

సీఎం కప్ క్రీడల సందర్భంగా అశ్వారావుపేటలో సీఎం కప్  పరేడ్ రన్ ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. అశ్వారావుపేట రింగ్ రోడ్డు నుండి అగ్రికల్చర్ కళాశాల వరకు ఈ పర్యటనలను అత్యంత ఉత్సాహవంతంగా ఎమ్మెల్యే జారే ఆధ్వర్యంలో మండల వివిధ శాఖల అధికారులు పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే జారి ఆదినారాయణ దమ్మపేట అశ్వారావుపేట మండలంలో విచిత్రంగా పర్యటించారు. ముందుగా గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. అనంతరం బాలరాజుగూడెం పంచాయతీ దిబ్బగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం పట్వారిగూడెం ప్రధాన సెంటర్ నందు రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. తదుపరి అశ్వారావుపేట మండల కేంద్రంలో సీఎం కప్ పరేడ్ రన్ ను ప్రారంభించారు. విద్యుత్ ప్రమాదంలో మరణించిన అశ్వారావుపేటకు చెందిన జూజం బంగారురావు కుటుంబానికి, అలాగే దమ్మపేట మండలం రంగవారిగూడెం గ్రామానికి చెందిన తంగేళ్ళముడి పోలయ్య కుటుంబానికి రూ 5 లక్షల చొప్పున మొత్తం రూ10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. అనంతరం దమ్మపేట మండలం అక్కినేపల్లి పంచాయతీ వెంకటరాజపురం గ్రామంలో నిర్వహించిన విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ అధికారులతో కలిసి కరెంట్ సమస్యల పరిష్కారం మెరుగైన సేవలు ప్రభుత్వ రాయితీలు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి