మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు 

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్).


 నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి  మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నల్లగొండ పానగల్ లోని పచ్చల  మరియు ఛాయాసోమేశ్వర దేవాలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వామివారి తీర్థ ప్రసాదలను అందజేసి శేషవస్త్రాన్ని అందజేసి ఆశీర్వదించారు.అనంతరం తిప్పర్తి మండలం మామిడాల శంబు లింగేశ్వరస్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి కొరకు రూ ..300116 అక్షరాల మూడు లక్ష ల నూటపదహారు రూపాయల విరాళం ప్రకటించారు . ఈ కార్యక్రమంలో నల్లగొండ నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్.. రెండో డివిజన్ కార్పొరేటర్ పెఱిక యాదయ్య, మామిడాల సర్పంచ్ కొత్తపల్లి సైదులు మాజీ కౌన్సిలర్ లు రావుల శ్రీనివాస రెడ్డి.. కందుల లక్ష్మయ్య సూర మహేష్.. ప్రదీప్ యాదవ్, రాపోలు వెంకటేశ్వర్లు.. తిప్పర్తి మహిళా అధ్యక్షురాలు కోండ్ర స్వరూప, ఊటుకూరు యాదగిరి రెడ్డి, మొకిరాల కృష్ణ నక్క సైదులు నవీన్ తిరుపతయ్య తదితరులు వెంట ఉన్నారు.

Tags:

About The Author

Latest News