తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.
వరంగల్ రీజియన్ విశ్రాంత ఉద్యోగులు పట్టాభి లక్ష్మయ్య, పాసికంటి మనోహర్...వెల్లడి.
హనుమకొండ జనవరి 13 లోకల్ గైడ్ :
మేము రిటైర్ అయిన తర్వాత 2017 నుండి ఇప్పటివరకు (09 సం"ల కాలం) రిటైర్మెంట్ సెటిల్మెంట్లు సంస్థ ద్వారా రావలసినవి రాకపోవడం మూలంగా రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా ఆర్ పి ఎస్ 2017 అరియర్స్ , 2017 ఏప్రిల్ నుండి 2024 ఏప్రిల్ వరకు రావాల్సిన గ్రాట్యుటి, లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్,2024అక్టోబర్ నుండి 2025 డిసెంబర్ వరకు రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు, సి సి ఎస్ సెటిల్మెంట్లు, ఆగస్టు'2025 నుండి డిసెంబర్'2025 వరకు రావలసిన గ్రాట్యుటీ లాంటి బకాయిలు, చట్ట ప్రకారం తక్షమే చెల్లించాలి,
సమయభావంతో దాత్సర్యం చేసుకుంటూ, ఇప్పటివరకు చెల్లించలేదు.
వీటికి తోడు వచ్చే అర కొర పెన్షన్ పత్రాలలో కొన్ని సూక్ష్మ లోపాలు ఉన్నాయని వాటిని ఈపీఎఫ్ఓ వారు తిరస్కరణకు గురిచేసి ఇబ్బందులు పెడుతున్నారు. డీ.డీ.లు చెల్లించిన కొందరికి " *హయ్యర్ పెన్షన్* " 20 నెలల గడచిననూ ఇంకా సాంక్షన్ చేయడం లేదు. సంస్థ యాజమాన్యం 2013, 2017 వేతన వివరాలను
ఈపీఎఫ్ఓ కు పంపకుండా పెన్షన్ పెరిగే అవకాశం లేకుండా చేయడం వల్ల పూర్తిగా నష్టపోతున్నాం. ఆర్టీసీలోని రిటైర్డ్ ఉద్యోగులందరం అప్పులు తీరక,
అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ కొందరు అకాల మరణం చెందుతున్నారు. పిల్లల పెండ్లిలకు, చదువులకు, అనారోగ్య కారణాలవల్ల చేసిన అప్పులు తీరక మానసిక వేదన చెందుతూ కాలం వెళ్లబుచ్చుచున్నాము.
కాబట్టి మాకు రావలసిన అన్ని రకాల బకాయిలు మేము జీవించి ఉండగానే చెల్లించాలని, పెన్షన్ లోని ఇబ్బందులను తొలగించాలని పై అధికారులను, ఎండి ని కోరుచున్నాము. ఈనెల20.1.2026 లోగా చెల్లిస్తారని భావిస్తున్నాం. లేని పక్షంలో 21 జనవరి 2026 రోజున *బకాయిల సాధన కోసం బస్సు భవన్ వద్ద బైటాయింపు కార్యక్రమం చేపడుతాం అన్నారు* ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతంగా రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులందరం కలిసి నిర్వహించ తలపెట్టాం అని తెలిపారు.కావున ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ,యాజమాన్యాం, తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి మా యొక్క సమస్యల పరిష్కారానికి సహకరిస్తారని ఈ తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులుగా కోరుకుంటున్నాము అన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో వరంగల్ రీజియన్ విశ్రాంత ఉద్యోగులు పట్టాభి లక్ష్మయ్య, పాసికంటి మనోహర్, అశోక్ రావు, వెంకటయ్య, ఎం.ఎస్.రావు, సదానందం, గూడెల్లి బిక్షపతి, విశ్వనాథం, సోమయ్య, పెద్ది రవీందర్, శివాజీ కోటగిరి, వీరన్న, యాదగిరి స్వామి, ఎల్లయ్య, హయగ్రీవ చారి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
