ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మహాదేవపూర్ వాసి 'పేట సాయి' ఎంపిక
3, 4, 5 తేదీలలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 44వ రాష్ట్ర మహాసభలలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భూపాలపల్లి (లోకల్ గైడ్ ప్రతినిధి)
కేంద్రంగా జనవరి 3, 4, 5 తేదీలలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 44వ రాష్ట్ర మహాసభలలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మహాసభల ముగింపు సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ రాబోయే ఏడాదికి సంబంధించి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ నూతన కార్యవర్గంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలానికి చెందిన పేట సాయిని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నియమించారు.
విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర:
పేట సాయి గతంలో ఏబీవీపీలో పలు హోదాల్లో పనిచేశారు.ఇంటర్ కాలేజీ వైస్ ప్రెసిడెంట్, టౌన్ హాస్టల్స్ ఇన్చార్జి,జిల్లా కో-హాస్టల్స్ ఇన్చార్జి, మహాదేవపూర్ నగర కార్యదర్శి
ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన సాయి, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటారనే గుర్తింపు తెచ్చుకున్నారు.
కృతజ్ఞతలు తెలిపిన పేట సాయి:
ఈ సందర్భంగా పేట సాయి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర శాఖకు తన నియామకానికి సహకరించిన వరంగల్ విభాగ్ పెద్దలకు మరియు తోటి కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల కోసం అనునిత్యం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
హర్షం వ్యక్తం చేసిన కార్యకర్తలు:
పేట సాయికి రాష్ట్రస్థాయి పదవి దక్కడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏబీవీపీ కార్యకర్తలు మరియు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం వల్ల జిల్లాలో సంఘం మరింత బలోపేతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
