ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ


 (ఖమ్మం :లోకల్ గైడ్)
పోలింగ్ సరళి, పోలీస్ బందోబస్త్ పరిశీంచిన పోలీస్ కమిషనర్

జిల్లాలో కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎదులాపురం, వైరా, కల్లూరు, మధిర, సత్తుపల్లిIMG-20260211-WA0140 మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సందర్శించారు. పోలీస్ బందోబస్త్ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, రామానుజం, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తో పోలింగ్ పక్రియ, బందోబస్త్ ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా  పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛా
యుతంగా నిర్వహించేందుకు
అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత
వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.

Tags:

About The Author

Latest News

ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్  ఇందిరమ్మ నూతన గృహప్రవేశంనికి హాజరైన ఎన్కతల గ్రామ సర్పంచ్ 
ఎన్కతల పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్   మోమిన్ పెట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో నూతన గృహప్రవేశానికి హాజరైన గృహప్రవేశ ఆహ్వానంలో ఎన్కతల సర్పంచ్ పటేల్ గారి...
సొంత గూటికి సత్తెన్న కందుకూరు మండలం నుంచి కాంగ్రెస్ లో చేరికలు.
మంచిర్యాల మేయర్ బాధ్యతల స్వీకరణ. 
నేడు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో ప్రతిష్టత వ్యక్తుల సమా వేశం
వివాహ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ.
ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్,బిజెపి నాయకులు
మిఠాయిలు పంచి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్  శ్వేత సత్యయాదవ్