లోక్ అదాలత్ లో 740 కేసులు పరిష్కారం.
By Ram Reddy
On
.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం లోక్ అదాలత్ లో 740 కేసులు పరిష్కరించినట్లు లోక్ అదాలత్ సభ్యులు తెలిపారు.ఉన్నత న్యాయ స్థానాల ఆదేశాల మేరకు రాజీ పడదగిన కేసులన్నీ పరిష్కరించినట్లు పేర్కొన్నారు.కక్షీదారుల విలువైన సమయం,అదేవిధంగా వారి వ్యయ ప్రయాసలను గుర్తించి ఉన్నత న్యాయస్థానాలు లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన కేసులన్నీ పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి జె ముఖేష్,ఎపిపిఓ అజయ్,లోక్ అదాలత్ సభ్యులు నల్లుల సంగీత,బురుస రమేష్,పలువురు సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
28 Mar 2026 23:45:48
లోకల్ గైడ్ హైదరాబాద్హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో...
