పట్టు విడని విక్రమార్కుల్లా పనిచేయాలి.పార్టీ విధేయులకే అధిష్టానం పట్టం కట్టింది.

బాధ్యతలు చేపట్టిన జిల్లా కమిటీ కార్యవర్గం ,      నియామక పత్రాలు అందజేస్తున్న డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డి.      ప్రజల్లో పనిచేసే నాయకులు ప్రజల గుండెల్లో ఉంటారు.

పట్టు విడని విక్రమార్కుల్లా పనిచేయాలి.పార్టీ విధేయులకే అధిష్టానం పట్టం కట్టింది.

నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ  కార్యవర్గాని శాల్వాలతో,  పూలమాలతో ఘనంగా సన్మానం.

వనపర్తి  (లోకల్ గైడ్ )మార్చి22
ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలకు, కార్యకర్తలకు వెన్నంటూ ఉంటూ పట్టు వీడని విక్రమార్కుల్లాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి సూచించారు. 
ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పూర్తిస్థాయి కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి  ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి హాజరై పాల్గొన్నారు. నూతనంగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గాని నియామక పత్రాలు ఇచ్చి, శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం మేరకు వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నియమించిందని అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి, గ్రామ కమిటీలను మండల కమిటీలను నియమించాలని సూచించడం జరిగింది అన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ ఆరు అంశాలపై సమీక్షించడం జరిగిందన్నారు. మొదటగా జిల్లా పార్టీ కార్యాలయాన్ని త్వరలోనే నిర్మాణం చేపట్టాలని  స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రతిపాదించగా కమిటీ సభ్యులందరూ ఆమోదించడం జరిగిందని అన్నారు. కొత్తగా నియమించిన జిల్లా కమిటీ సభ్యులు ప్రజల కోసం, కార్యకర్తల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. లేనియెడల వారి పనితీరును బట్టి సమలోచనచేసి మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. పదవులను అలంకరణప్రాయంగా చూడొద్దని క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజల మనసు గెలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి  సెక్రెటరీ  నందిమల్ల యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ డెలికేట్ శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, బ్రహ్మచారి, సాయి చరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కోళ్ల వెంకటేష్, చిర్ల జనార్దన్ సాగర్,  కాంగ్రెస్ యువజన జిల్లా అధ్యక్షులు ఆదిత్య, పాండు సాగర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు యాదగిరి, పర్వతాలు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి