మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు

చిన్న శ్రీశైలం యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

మానవసేవనే మాధవసేవగా భావించి పేదల సేవలో నిరంతరం ముందుండే సమాజ సేవకుడు చిన్న శ్రీశైలం యాదవ్ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ వారి మిత్ర బృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కష్టాలలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తూ “అన్న అంటే నేను ఉన్నాను” అనే భావంతో సేవలందిస్తున్న శ్రీశైలం యాదవ్ నిజమైన సేవా తత్వానికి ప్రతిరూపమని కొనియాడారు. పేద, ధనిక అనే తేడా లేకుండా తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇచ్చే ఆయన సేవాభావం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్, శ్రీశైలం యాదవ్ ని సన్మానించి, అష్టైశ్వర్యాలతో ఆయురా రోగ్యాలతో కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో మరింత కృషి చేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కేసాయన్న ముదిరాజ్, ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, సుభాష్,  తదితరులు పాల్గొని శ్రీశైలం యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి