అందుబాటులో లేని సిబ్బంది....
అవస్థలు పడుతున్న ఓటర్లు
By Ram Reddy
On
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్లో అందుబాటులో లేని సిబ్బంది.వికలాంగులు వృద్ధులు ఓట్లు వేయడానికి వెళుతున్న క్రమంలో వారికి చేతన అందించి ఓటు వేసేందుకు సహకరించాల్సిన సిబ్బంది లేకపోవడంతో వికలాంగులు వృద్ధులు పలువురు మహిళలు అనేక అవస్థలు పడుతున్నారు.ఈ విషయమై ఎవరైనా స్వచ్ఛందంగా వారికి సేవలు అందించడానికి ముందుకు వస్తుంటే కొంతమంది పోలింగ్ బూత్ లోని ఏజెంట్లు గొడవలకు దిగుతున్నారు.అధికారుల ముందు చూపు లేకపోవడంతోనే 27,28,29,30,31,32 పోలింగ్ స్టేషన్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా 28వ బూత్ లో స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:
About The Author
Related Posts
Latest News
24 Feb 2026 20:47:27
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):-
జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
