గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్..

కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ అందిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి తెలిపారు.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్..

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

ఎన్నో సంవత్సరాలుగా చాలామంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని గర్భాశయ క్యాన్సర్ నివారణకు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ అందిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి తెలిపారు.బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం అందిస్తున్న హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్య అతిధిగా హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు గర్భాశయ క్యాన్సర్ రాకుండా14ఏండ్ల లోపు బాలికలు ఈ వ్యాక్సిన్ ను తప్పకుండా తీసుకోవాలని అన్నారు.ఒకసారి టీకా వేసుకుంటే జీవితాంతం రక్షణ ఉంటుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ,ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్,కౌన్సిలర్ లు చింతల వసంత,డీకొండ పద్మలత,జంగం కల్పన,ఒబిసి సెల్ స్టేట్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్,జమ్మికుంట విజయ్,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News