రైల్వే భూముల్లో యదేచ్ఛగా కంకర దందా..
పలు బస్తీల ప్రజలకు ఇబ్బందులు..
By Ram Reddy
On
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని గంగారం నగర్ ఎదురుగా గల సౌత్ సెంట్రల్ రైల్వే భూమిలో కొనసాగుతున్న కంకర అక్రమ వ్యాపారం.పట్టణంలోని కన్నాలబస్తి,టేకులబస్తిలతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు రైల్వే శాఖ మెట్లు నిర్మించి ప్రజల సౌకర్యం ఏర్పాటు చేసింది.జాతీయ రహదారి అదేవిధంగా రైల్వే శాఖకు చెందిన భూముల మధ్యలో కంకర ఇసుక పెద్ద ఎత్తున డంపు చేస్తు అటుగా వెళ్లే ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యాపారం చేస్తు ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న వారి పట్ల రైల్వే శాఖ జాతీయ రహదారి శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.కంకర,ఇసుక కుప్పలతో పాటు జెసిబి పెద్ద ఎత్తున ట్రాక్టర్లను నిత్యం అక్కడే ఉంచుతు రైల్వే,ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.ఈ విషయమై స్థానిక రైల్వే,జాతీయ రహదారుల శాఖల అధికారులకు స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా రైల్వే,జాతీయ రహదారుల అధికారులు స్పందించి వెంటనే కంకర,ఇసుక కుప్పలను తొలగించి,జెసిబిలను అక్కడి నుండి తరలించి రైల్వే శాఖకు చెందిన భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
01 Mar 2026 20:33:40
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
