అరుదైన గుండె శస్త్ర చికిత్సలకు నిలయం, యశోద హాస్పిటల్స్
యశోద హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ జరివాల... వెల్లడి
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01లోకల్ గైడ్
హనుమకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పంకజ్ వినోద్ మాట్లాడుతూ యశోద హాస్పిటల్స్ మల్టీడిసిప్లినరీ హార్ట్ టీమ్ శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని భావించిన పేసెంట్లకు గుండె నిర్మాణం క్లిష్టంగా ఉన్న వారికి కాంప్లెక్స్ ట్రాన్స్ కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆడ్వూన్స్డ్ కాంప్లెక్స్ కోరోనరీ యాంజియోప్లాస్ట్ ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు, ఈ మినిమల్లీ ఇన్వేసివ్, కాథెటర్ ఆధారిత చికిత్సలు ఎంపిక చేసిన పేసెంట్లకు సమర్థవంతమైన ఫలితాలను అందించడమే కాకుండా, త్వరగా కోలుకునేలా చేస్తాయన్నారు.
తీవ్రమైన అయోర్టిక్ వాల్వ్ వ్యాధి, అడ్వాన్స్డ్ కోరోనరీ ఆర్టరీ వ్యాధులు ముఖ్యంగా వృద్ధులలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పేసెంట్లలో హార్ట్ ఫెయిల్యూరకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తెలిపారు,ఇటువంటి పేసెంట్లకు సాధారణ ఓపెన్-హార్ట్ సర్జరీ చేయడం రిస్క్ తో కూడుకున్న పని అన్నారు, యశోద హాస్పిటల్స్ వంటి అనుభవజ్ఞులైన కేంద్రాలలో, ఇటువంటి అడ్వాన్స్ కాథెటర్ ఆధారిత చికిత్సలు సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయన్నారు.ఈ ప్రక్రియలు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, ఇమేజింగ్ నిపుణులు, క్రిటికల్ కేర్ నిపుణులతో కూడిన 'హార్ట్ టీమ్' ఆధ్వర్యంలో జరిగాయనీ,సిటి.స్కాన్, ఎకోకార్డియోగ్రఫీ, ఐవియుఎస్ లేదా ఓసిటి వంటి ఇమేజింగ్ పరికరాల సహాయంతో వాల్వ్ అమరిక, స్టంట్ వేయడం అత్యంత ఖచ్చితత్వం తో నిర్వహించామన్నారు. చాలా మంది పేషెంట్లు నేడు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల సాధారణ సర్జరీ చేయించుకో లేని క్లిష్ట స్థితిలో ఉంటున్నారని,సరైన పేసెంట్ల ను ఎంపిక చేయడం, టీమ్ వర్క్ ద్వారా రిస్క్ తగ్గించి వారి రికవరీ ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
Tags:
About The Author
Latest News
12 Feb 2026 21:43:24
చదువుతో దేనినైనా సాధించవచ్చు.
ఏటీడీవో . శ్రీనివాస్
