హనుమాన్ జయంతి వేడుకకు పేటకు చీకోటి ప్రవీణ్ రాక
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 1:
నారాయణపేట జిల్లా కేంద్రం లో హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 2న సాయంత్రం బారంబావి నుంచి నిర్వహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా చికోటి ప్రవీణ్, మదన్ గుప్తా హాజ రవుతున్నట్లు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకు లు కన్న శివకుమార్, ప్రవీణ్, శ్రవణ్, ప్రకాష్ భట్టాడ్, సందీప్ తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ గురువారం సాయంత్రం నిర్వ హించే వీర హనుమాన్ శోభా యాత్రకు జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల నుంచి, బస్తీల నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. శోభాయాత్ర అనంతరం గొడుగు గేరీ హనుమాన్ మందిరం వద్ద సభ ఉంటుం దన్నారు. కాషాయ ధ్వజాల తో ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఫోటో రైట్ అప్:4.సమావేశంలో మాట్లాడుతున్న వి ఎచ్ పి నాయకులు
______________________
Tags:
