అంబేడ్కర్ కు బిజెపి ఘన నివాళి

అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

అంబేడ్కర్ కు బిజెపి ఘన నివాళి

బిజెపి రాష్ట్ర నేత నాగురావు నామాజీ 

నారాయణపేట ఏప్రిల్ 14:
రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బిజెపి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ మాట్లాడుతూ
జ్ఞానమే ఆయుధంగా, పోరాటమే మార్గంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆయన కలలుగన్న సామాజిక సమరసత, సమానత్వం వైపు మా అడుగులు వేస్తున్నామని,
'విద్య అభ్యసించు  సమీకరించు  పోరాడు' అన్న బాబాసాహెబ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. రాజ్యాంగం అందించిన చైతన్యంతో, అణచివేతపై ధిక్కార స్వరమై  ప్రగతి పథంలో ముందుకు సాగుతామన్నారు.
ఆయన ఆశయాలను అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కే.రతంగ్ పాండురెడ్డి,జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్య యాదవ్,కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్,అదనపు సహాయ న్యాయవాది నందు నామాజీ,మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజుల జి ఆర్ రెడ్డి,కాన్సిలర్లు,పట్టణ బిజెపి అధ్యక్షుడు పోషల్ వినోద్,జిల్లా ,పట్టణ,మండల నాయకులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:1.అంబేడ్కర్ కు నివాళి అర్పించిన బిజెపి నాయకులు 
______________________
Tags:

About The Author

Latest News