పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...
ప్రమాద రహిత సమాజం కోసం పౌరులందరూ ఏకం కావాలి..
By Ram Reddy
On
లోకల్ గైడ్ ' ఖమ్మం
మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపిన ఉప ముఖ్యమంత్రి*
ప్రమాద రహిత సమాజం కోసం పౌరులందరూ ఏకం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు.
మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు,టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్,నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డియఫ్ వో సిర్ధార్ విక్రమ్ సింగ్, నగర మేయర్ పునకొల్లు నీరజ ఖమ్మం నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు వాహనదారులలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం లక్ష్యంతో నిర్వహిస్తున్న అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత మానవహారంగా ఏర్పడి రహదారి నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పోలీసులు ప్రజా ప్రతినిధులు నాయకులు వివిధ వర్గాల ప్రజలు సంయుక్తంగా వేగ నియంత్రణ వంటి నిబంధనలను పాటిస్తూ, సురక్షిత ప్రయాణం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమని, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం ప్రాణాంతకమని అధికారులు అవగాహన కల్పించారు.
Tags:
About The Author
Latest News
14 Apr 2026 19:17:39
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
- అంబేద్కర్-బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులు దొరేటి సుధాకర్.
