యువ భారతాన్ని నిర్మించాలి

యువ భారతాన్ని నిర్మించాలి

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 14 :

మెరుగైన విద్య ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ రహిత యువ భారతాన్ని నిర్మించడమే అంబేద్కర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు, సింగరేణి మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. 

      మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన జన సమాఖ్య (డీ వై యఫ్ ఐ ) సింగరేణి మండలం కమిటీ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా పరిశ్రమలను ప్రైవేటు పరం చేసి 45% గరిష్టానికి నిరుద్యోగిత రేటు పెంచి కులం మతం జాతి పేరిట వైశాల్యాలు రగిల్చి చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ రంగంలోనే విద్య ఉపాధి అవకాశాలను సృష్టించాలని చెప్పిన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసే అధికారంలోకి వచ్చిన బిజెపి,కాంగ్రెస్ ప్రభుత్వాలు కాలరాచి, భారత రాజ్యాంగాన్ని మార్చాలని,మనువాద పాలన తేవాలని ప్రయత్నిస్తున్నాయి.ఈ ప్రయత్నాలను యువతి యువకులు ఐక్యంగా నిలిచి అడ్డుకోవడం ద్వారా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్ ఆశయాలను సాధించటం అని ఆదేర్ల వినయ్ కుమార్ పిలుపునిచ్చారు . ఈ జయంతి కార్యక్రమం లో డివైఎఫ్ఐ కార్యకర్తలు గాదె నరేష్, కాకాటి పృద్వి , ఉప్పెల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News