నేటి యువత అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి
ఎస్పీ డాక్టర్ వినీత్
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 14:
నేటి యువత అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు.
మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భీంరావ్ రాంజీ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహానీయుడని పేర్కొన్నారు. ఆయన ఒక ప్రతిభావంతమైన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా కూడా సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వివక్షను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు.
అలాగే, స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ శిల్పిగా అంబేద్కర్ సేవలు అమూల్యమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపారమని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను సమాజంలో స్థాపించడంలో ఆయన పాత్ర అత్యంత గొప్పదని తెలిపారు.
నేటి యువత అంబేద్కర్ ఆశయాలను లోతుగా అర్థం చేసుకుని, వాటిని ఆచరణలో పెట్టేందుకు కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి అంశాలను జీవితంలో అనుసరించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలంటే అంబేద్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్‌ఐ నరసింహ, ఆర్‌ఎస్‌ఐ శివశంకర్, ఆర్ముడు మరియు రిజర్వు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:7.నివాళి అర్పించిన ఎస్పీ,పోలీసులు
___________________
Tags:
About The Author
Latest News
14 Apr 2026 19:17:39
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
- అంబేద్కర్-బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులు దొరేటి సుధాకర్.
