రోడ్డు ప్రమాదాల నియంత్రణ ఫై ప్రజల్లో అవగాహన రావాలి-

జిల్లేడు చౌదరి గూడెం మండల తహసీల్దార్ జగదీశ్వర్ .  ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవు - ఎస్సై విజయకుమార్.         

రోడ్డు ప్రమాదాల నియంత్రణ ఫై ప్రజల్లో అవగాహన రావాలి-

వాహనాలు నడిచేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -లోకల్ గైడ్ దినపత్రిక సీఎండీ చిలకమర్రి రాంరెడ్డి.                                                                         

        జిల్లెడు చౌదరి గూడెం ( లోకల్ గైడ్ ):                               రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో చైతన్యం రావాలని జిల్లెడు చౌదరి గూడెం మండలం తాసిల్దార్ జగదీశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లెడు చౌదరి గూడెంలో నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక (99 రోజుల ) కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత ఎస్సై విజయకుమార్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ ట్రాఫీక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జగదీశ్వర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజలు అవగాహన కల్పించుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనల ఫై అవగాహన లేకపోతే  ప్రమాదాలు జరిగి తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదాలు ఉంటాయన్నారు. అందుకోసం వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఒక చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చునన్నారు  అదేవిధంగా ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ .... IMG-20260413-WA0087వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ వాహనాలపై సురక్షితంగా తమ గమ్య స్థానాలను చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత ఫై ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తాను... డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ ను ఉపయోగించను... మద్యం సేవించి వాహనాల్ని నడపను... వేగ పరిమితులను తప్పక పాటిస్తాను... వాహనాన్ని నడిపేటప్పుడు సీటు బెల్టు లేదా హెల్మెట్ ను తప్పకుండా ధరిస్తానని... ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటిస్తానని.... ప్రజా ప్రతినిధులు యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. 
 ఈ కార్యక్రమంలో పాల్గొన్న  లోకల్ గైడ్ దినపత్రిక సీఎం డి చిలకమర్రి రామిరెడ్డి మాట్లాడుతూ.....ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ను తప్పక ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ వాడడం, మద్యం సేవించి నడపడంలాంటి నిర్లక్ష్యాల వల్ల ఎంతోమంది ప్రమాదాల మారినబడి ప్రాణాలను సైతం కోల్పోతున్నారన్నారు. దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాన దారులు ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించి ప్రయాణాలు కొనసాగితే ఎలాంటి ప్రమాదాలు జరగవని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లెడు గ్రామ సర్పంచ్ బేక్కం మౌనిక శశిధర్, ఎలుకగూడెం సర్పంచ్ చాకలి బందయ్య, వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News