ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
చరిత్ర ఉన్నంతకాలం ఆయన గుర్తుండిపోతాడు. - ఆయన జీవితం నేటి సమాజానికి ఆదర్శప్రాయం.
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. - అంబేద్కర్-బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షులు దొరేటి సుధాకర్.
లోకల్ గైడ్/బంట్వారం:
మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్–బాబు జగ్జీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు దొరేటి సుధాకర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం ఆయన మహత్తును చాటుతోందన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి రమేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రవిందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, బీజేపీ మండల అధ్యక్షుడు మహేష్ యాదవ్, మార్కెట్ కమిటీ సభ్యుడు పోచారం యాదగిరి, ఎంఆర్పీఎన్ మండల ఇన్‌చార్జ్ భరత్ కుమార్, ఎస్సై విమల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్దిరాములు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
