ది పార్కు అరేబియన్ మండి" రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..
కస్టమర్లకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందజేస్తూ వారి అభిమానాన్ని పొందాలన్నారు
కూకట్ పల్లి నియోజకవర్గం కెపిహెచ్ బి రోడ్ నెంబర్ 6 మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన "ది పార్క్ అరేబియన్ మండి" రెస్టారెంట్ ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందజేస్తూ వారి అభిమానాన్ని పొందాలన్నారు రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ మా
రెస్టారెంట్ పేరులోనే "ది పార్క్" అనే పదం ఉందని దానికి తగ్గట్టుగా చిన్న పిల్లలను యువతను ఆకట్టు కొనే విధంగా రెస్టారెంట్ డిజైన్ చేయబడిందన్నారు అలాగే మా వద్ద అన్ని రకాల ఐటమ్స్ కూడా ఎంతో రుచికరంగా ఉంటాయని క్వాలిటీ క్వాంటిటీ విషయంలో ఎక్కడా రాజి పడకుండా నిష్ణాతులైన వంట మాస్టర్ లతో ప్రతి ఐటమ్ తయారు చేయబడుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మా రెస్టారెంట్ ను సందర్శించి మా వంటకాలను రుచి చూడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్య కుటుంబ సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు.
