విద్యుత్తు షాక్ తో యువ రైతుమృతి
పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం
By Ram Reddy
On
మాగనూర్ మార్చి 7:
మాగనూరు మండల కేంద్రానికి చెందిన యువరైతు బచ్చి దేవప్ప శనివారం కరెంట్ షాక్ తో మృతి చెందాడు.దాంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.తన వ్యవసా య పొలం దగ్గర ప్రమాద వశాత్తు కరెంటు షాకుకు గురై మరణించాడు.దేవప్ప కుటుం బాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నారాయణ పేటజిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ , జిల్లా నాయకులు పుంజనూరు ఆంజనేయులు, భరత్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.దేవప్ప అతి నిరుపేద రైతు రెక్కడీతే కానీ పూట గడవని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.,ఆయన పిల్లలకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలో ఉచిత విద్యా అందించాలని, మృతుని కుటుంబానికి తక్షణమే ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.
ఫోటో రైట్ అప్:మృతి చెందిన రైతు దేవప్ప
______________________
Tags:
About The Author
Latest News
20 Mar 2026 17:57:39
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
