జపాన్‌లో ట్విట్టర్ కిల్లర్‌కు మరణశిక్ష అమలు

జపాన్‌లో ట్విట్టర్ కిల్లర్‌కు మరణశిక్ష అమలు

లోక‌ల్ గైడ్: జపాన్‌ను ఒక్కసారిగా గజగజలాడించిన ‘ట్విట్టర్ కిల్లర్’కు ఇవాళ మరణశిక్షను అమలు చేశారు. 34ఏళ్ల టకాహిరో షిరాయిషి 2017లో 9 మంది, అందులో 8 మంది యువతులను హత్య చేసి దేశాన్ని కుదిపేశాడు. 2022లో అతనికి కోర్టు మరణశిక్ష విధించగా, చివరికి శిక్షను అమలు చేశారు.టకాహిరో ట్విట్టర్‌లో అకౌంటు పెట్టి, ఆత్మహత్య ఆలోచనలున్న వ్యక్తులతో పరిచయం పెంచుకుని, “నువ్వు చనిపోవాలనుకుంటే, సహాయం చేస్తా” అని నమ్మించి తన ఇంటికి రప్పించేవాడు. ఆపై వారిని మోసంగా హతమార్చేవాడు. దర్యాప్తులో అతను 15 నుంచి 26ఏళ్ల వయసున్న యువతులను ముఖ్యంగా టార్గెట్ చేసుకున్నట్టు తెలిసింది.2017 అక్టోబరులో ఓ అదృశ్యమైన వ్యక్తి కేసు విచారణలో జమా సిటీలో గుర్తు తెలియని శరీర భాగాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఆచూకీตามించి టకాహిరో ఫ్లాట్‌లో తనిఖీ చేస్తే, టూల్ బాక్స్‌లలో, కూలర్లలో ముక్కలైన శరీర భాగాలను గుర్తించారు.తనకు మరణశిక్ష విధించవద్దని లాయర్లు వాదించారు. “బాధితులు బలవన్మరణానికి ఒప్పందమే” అని చెప్పారు. కానీ, ప్రాసిక్యూటర్లు “ఇది పద్ధతి ప్రకారం హత్య, ఉద్దేశపూర్వక క్రైమ్” అని వాదించడంతో చివరకు అతనికి డెత్ పెనాల్టీ ఖరారైంది. విచారణలో టకాహిరో “తానే చంపాడు” అని అంగీకరించాడు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్