'ఓ భామ అయ్యో రామ' చిత్రం  బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాలి: రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ 

'ఓ భామ అయ్యో రామ' చిత్రం  బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాలి: రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ 

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న  నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో  కథానాయికగా పరిచయమవుతోంది.  రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై  హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది.  కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మంచు మనోజ్‌ బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ '' సుహాస్‌ నాకు సోదరుడు లాంటి వాడు. ఎప్పుడూ కలిసిన చిరునవ్వుతో పాజిటివ్‌గా ఉంటాడు. ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగాడు. నేపో కిడ్స్‌ అయినా సినిమా పరిశ్రమలో కష్టపడాల్సిందే. కష్టపడితేనే విజయం. నేను ఈ విషయాన్ని ఓ నెపో కిడ్‌గా చెబుతున్నా. యూట్యూబ్‌ నుంచి హీరోగా ఎదిగిన సుహాస్‌ జర్నీ ఎంతో ఇన్‌స్పిరేషన్‌. తమిళంలో విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ కూడా అలాంటి స్టారే.. అన్ని తరహా సినిమాలను చేస్తాడు. ఇండస్ట్రీలో సక్సెస్‌ కావడం కష్టమే. కాని కష్టపడితే సక్సెస్‌ సాధిస్తాం. ఈ సినిమా విజయం సాధించి నిర్మాతలకు, దర్శకుడికి బ్రేక్‌ నివ్వాలి. మంచి టీమ్‌తో రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావాలి' అన్నారు. హీరో సుహాస్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం టీమ్‌ అంతా ఎంతో కష్టపడ్డారు. అందరూ ఈ సినిమా చూసిన తరువాత మాళవిక ప్రేమలో పడిపోతారు. అలీ, అనిత, పృథ్వీ  లాంటి సీనియర్ ఆర్టిస్ట్‌లతో నటించడం ఎంతో హ్యపీగా ఉంది. ప్రతి  అబ్బాయి సక్సెస్‌ఫుల్‌  లైఫ్‌లో తల్లి, భార్యలు ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు. ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషన్స్‌ ఈ చిత్రంలో అందరి హృదయాలను హత్తుకుంటాయి. అందరి సపోర్ట్‌తో మంచి సినిమాలు చేస్తున్నారు. త్వరలో నా కెరీర్‌కు సంబంధించిన మరిన్ని బిగ్‌న్యూస్‌ తెలియజేస్తాను' అన్నారు. నిర్మాత హరీష్‌ నల్లా మాట్లాడుతూ ''  స్నేహితుడు ప్రదీప్‌ సహకారంతో  సుహాస్‌తో మా జర్నీ ప్రారంభమైంది. సుహాస్‌ కథ ఓకే చెప్పగానే సినిమా హిట్‌ అనుకున్నాను. మణికందన్‌ ఫోటోగ్రఫీ విజువల్స్‌ ఈ సినిమాలో ఎంతో రిచ్‌గా ఉంటాయి. బ్రహ్మా కడలి వేసిన సెట్స్‌  చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. ఇంత తక్కువ ఖర్చుతో ఇలాంటి సెట్స్‌ వేశాడా అనిపించింది. రథన్‌ సంగీతం ఈ సినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యింది. ఈ సినిమాకు మాటీమ్‌ మల్టీటాస్క్‌లు చేశారు. దర్శకుడు మంచి టీమ్‌ను సెట్‌ చేసుకున్నాడు. అందువల్లే ఈ రోజు మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. రామ్‌కు దర్శకుడిగా మంచి భవిష్యత్‌ ఉంటుంది. సినిమా చూశాను. కొత్త దర్శకుడిలా కాకుండా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశాడు.ఈ చిత్రంలో సుహాస్‌ పర్‌ఫార్మెన్స్‌ మరో రేంజ్‌లో ఉంటుంది' అన్నారు. 

Tags:

About The Author

Latest News