చైర్మన్ పీఠం కోసం పది కోట్లు...!! మున్సిపల్ ఎన్నికల వేళ ఆశావహ అభ్యర్థులకు గాలం.

వసూళ్లకు తెరలేపిన అధికార పార్టీ  కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు. మిర్యాలగూడలో అధికార పార్టీకి బీటలు.

చైర్మన్ పీఠం కోసం పది కోట్లు...!!  మున్సిపల్ ఎన్నికల వేళ ఆశావహ అభ్యర్థులకు గాలం.

నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అవసరమైతే ఆస్తులైనా అమ్ముకుంటాం.. ఇచ్చిన మాట ఎట్టిపరిస్థితుల్లో తప్పము... గులాబీ తీర్థం పుచ్చుకున్న 200 మంది కార్యకర్తలు. బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్థ 

 మిర్యాలగూడ జనవరి 7
 (లోకల్ గైడ్, తెలంగాణ)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అధికార పార్టీ పన్నిన వ్యూహాలను, ఎత్తుగడలను బీఆర్ఎస్ సమర్ధవంతంగా తిప్పిగొడుతున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం ఘోరంగా విఫలమైందని ప్రతీ దశలో బీఆర్ఎస్ ఎండగడుతున్నది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజాక్షేత్రంలో గులాబీ శ్రేణులు విశేష ప్రజాదరణ పొందుతున్నాయి. అమలుచేయలేని హామీలను ఎరగా చూపి మార్పు కోసం అంటూ ప్రజలను మభ్యపెట్టి నయవంచన చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న  కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాల అమలును విస్మరించి డిల్లీకి కప్పం కట్టే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ పార్టీ అంటే రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి అధికమవుతున్నది. దేశానికి వెన్నుముకైన రైతన్న రైతు బంధు, రైతు బీమా అష్టకష్టాలు  పడుతున్నారు. ఆరు గాలం శ్రమించే అన్నదాత యూరియా కోసం క్యూలైన్లలో  పడిగాపులుగాసే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. రేవంత్ సర్కార్ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు సాగును విడిచి ప్రత్యామ్నాయ వృతులను చేపట్టేందుకు పట్టణాలు, నగరాల బాట పడుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. నల్లగొండ జిల్లాలో ప్రధాన వర్తక కేంద్రంగా విరాజిల్లుతున్న మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మునపటి కంటే మరింత బలోపేతం అవుతున్నది. మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు హయాంలో జరిగిన అభివృద్ధికే ప్రజలకు జై కొడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ హయంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాంగ్రెస్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గం ప్రగతి పదేండ్లు వెనక్కి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారాలే  తప్ప పనుల ప్రారంభం  ఒక్క ఇంచు కూడా ముందుకు సాగని దుస్థితి గోచరిస్తున్నది.  కార్యకర్తలకు సముచిత స్థానం, గౌరవం లభించకపోవడం కారణంగా బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతున్నది. మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తనయుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ ప్రదర్శిస్తున్న రాజకీయ చతురతను, దూకుడును  రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ  సీనియర్ 
నాయకులు ప్రశంసిస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న రాజనీతి, ప్రజ్ఞ ఫలితంగా, గతంలో బీఆర్ఎస్ హయంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ప్రామాణికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇతర పార్టీ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు మిర్యాలగూడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు కూలైన్లు కడుతున్నారు. వీరి చేరికలను నిలువరించడం, అడ్డుకట్ట వేయడం కాంగ్రెస్ నేతలకు సాధ్యపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
మున్సిపల్ ఎన్నికల నగారా ఇంకా మోగనేలేదు....కానీ, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందారు. దీంతో, గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడిన నేతలు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే ఆశావహ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ నిరాదరణకు గురైన నేతలు, ప్రజాదరణ కలిగిన బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు తెరలేపింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే అభ్యర్ధుల్లో ఎవరైతే రూ.10 కోట్లు ముట్టజెబితే వారికే మున్సిపల్ చైర్మన్ పీఠం ఖరారు చేస్తామని గాలం వేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ఈ మేరకు సొంత పార్టీలోని కీలక నేతలతో  సంప్రదింపులు జరుపుతూ వసూళ్లకు తెరలేపినట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం గట్టిపోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు, ప్రజాక్షేత్రంలో విశేష  ఆదరణ కలిగిన నేతలు వారి కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటం పట్ల కాంగ్రెస్ నేతల కంటికి కునుకులేకుండా పోయింది. 

తమను నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్  నల్లమోతు సిద్దార్థ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  27వ వార్డు కాంగ్రెస్ పార్టీ  ఇంఛార్జీ  రేబెల్లి లోహిత్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 200 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్య నేతలు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నభీ మోజు నాగార్జున చారి, ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్  సమక్షంలో గులాబీ పార్టేలో చేరారు. పార్టీలో చేరిన నాయకులను గులాబీ కండువాలు కప్పి నల్లమోతు సిద్దార్థ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ అన్నారు.నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహానికి, ద్రోహాలకు, కొనసాగుతున్న ద్రోహాల పరంపర విషయంలో వాస్తవాలను  తెలంగాణ ప్రజల ముందు  బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు పీపీటి ఇచ్చారని అన్నారు. శాసనసభ కొనసాగుతున్న పద్ధతి, శాసనసభలో ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్లు ఉందన్నారు.తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ ముక్తి కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. తన చావును కూడా తలపెట్టి తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడు కేసీఆర్. 
కరువు నేలల్లో సిరులు పండించి, మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు కేసీఆర్. ఇవాళ అట్లాంటి కేసీఆర్  గురించి 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్  ఉద్దేశించి మాట్లాడితే హృదయం రగిలిపోతుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. 
ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమైక్యవాదుల సంచులు మోస్తున్నప్పుడు, సమైక్యవాదుల బూట్లకు పాలిష్ చేస్తున్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినం.
ఏ తెలంగాణ గురించి అయితే కొట్లాడినమో, ఈ తెలంగాణ రావాలని కలలు కన్నమో, ఇవాళ ఆ తెలంగాణ ఒక అల్పుడి చేతిలో, ఒక అల్పబుద్ధి చేతిలో విలవిలలాడుతుంటే బాధ అనిపిస్తుంది.ఉరి తీయాల్సి వస్తే కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు ఉరితీయాలో తెలవదు. 
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరితీయాలి.అన్ని రంగాల్లో అట్టర్ ప్లాప్ ప్రభుత్వం, సర్వే సర్వత్రా విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.  మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కే  దక్కుతుందన్నారు. మున్సిపల్  ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని నల్లమోతు సిద్దార్థ  సూచించారు. ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించాలని నల్లమోతు సిద్దార్థ తెలిపారు. రెండున్నర ఏండ్ల  కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిపాలన అగమ్యగోచరంగా మారిందన్నారు.కార్యక్రమములో పద్మశెట్టి కోటేశ్వర రావు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, లింగంపల్లి చిరంజీవి, షోయబ్,పునాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, కంచి సత్యనారాయణ, నల్లగంతుల నాగభూషణం, యర్రమళ్ళ దినేష్,దోనేటి సైదులు, శ్రీనాథ్, వడ్డేపల్లి శ్రీనివాస్, బాచి,కూరపాటి సాంబశివ రావు, సిరసనగండ్ల ఈశ్వర్ చారి,మీసాల జగదీష్  నాంపల్లి యేసు, నరేష్—పార్టీలో చేరిన వారు స్వాతి,ప్రదీప్,కృష్ణ,సతీష్,నవీన్, గణేష్,కార్ల యల్లయ్య, శ్రీను, నాగయ్య, బంగారి, తదితరులు ఉన్నారు. 

యువనేత సిద్దార్థ చరిష్మాకు బీఆర్ఎస్ క్యాడర్ ఫిదా.....

మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ  రాజకీయ చతురత, చరిష్మా  అందరినీ ఆకట్టుకుంటున్నది.  ఇటీవల పార్టీ గుర్తుతో సంబంధం  లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో యువనేత తన మార్క్ ను కనబర్చారు. బీఆర్ఎస్ క్యాడర్ ను అత్యంత బలోపేతం చేస్తున్నారు. అవిశ్రాంతంగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మరింత పెంచారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించి దిశా, నిర్దేశం, మార్గదర్శనం చేస్తున్నారు. గులాబీ పార్టీలో పునరుజ్జీవం తెచ్చారు. కార్యకర్తల్లో పునరుత్తేజం కల్పించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శనం మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుతెన్నులపై సమగ్ర అవగాహన పెంచుతున్నారు.  ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందొద్దని సూచించారు. రానున్నది మన ప్రభుత్వమే....పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థుల గెలుపుతో రేవంత్ సర్కార్ ఖంగుతిన్నది. బీఆర్ఎస్ ను నిలువరించేందుకు విఫలయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ క్యాడర్ మళ్ళీ పుంజుకునేలోపే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో యువనేత నల్లమోతు సిద్దార్థ  అనుసరించిన వ్యూహాలు ఫలప్రదమైన ఫలితాలను ఇచ్చాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో రోజురోజుకూ గులాబీ శ్రేణులు గతం కంటే మరింతగా పుంజుకున్నాయి. మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు హయాంలో మిర్యాలగూడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రెండెండ్లలో జరిగిన అభివృద్ధి శూన్యం. మిగిలిన మూడెండ్లలో  కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజల చూపు మళ్ళీ బీఆర్ ఎస్ వైపే మళ్ళింది. మళ్ళీ కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి