ముత్యాల ముగ్గు మురిపెం. అలరించిన ముత్యాల ముగ్గుల పోటీలు.

శివసాగర్ పాఠశాలలో ముగ్గులతో మెరిసిన విద్యార్థులు.

ముత్యాల ముగ్గు మురిపెం.  అలరించిన ముత్యాల ముగ్గుల పోటీలు.

శివసాగర్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.

 

లోకల్ గైడ్/ తాండూర్:
తాండూర్ పట్టణంలోని శివసాగర్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు రకరకాల ముత్యాల ముగ్గులతో అలరించి అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా సంక్రాంతిని పురస్కరించుకొని పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. దీంట్లో భాగంగా శివసాగర్ పాఠశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మణికంఠ, సాయికుమార్, రమ్య, కావ్య, ఆర్తి స్థాయి, రితేష్, అబుతాల్,లకు  ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రధానోపాధ్యాయులు అంగనూరు కిరణ్ కుమార్, ఉదయ్ శంకర్ పటేల్ ల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థుల సంతోషంలో భాగంగా, మా పాఠశాలలో అన్ని రకాల సంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, యాన్యువల్ డే, వంటివి నిర్వహిస్తుంటామని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి ఫలితాలతో మా పాఠశాలను ముందుకు తీసుకెళుతున్నామని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి