మంజీర రోడ్డును కర్రలు, తాళ్లు పెట్టీ కబ్జా చేస్తున్నారు, చందనగర్‌లో ట్రాఫిక్ అస్తవ్యస్తం
చెన్నారెడ్డి ఆసుపత్రి పక్కన అక్రమ పార్కింగ్, ప్రయాణికుల కష్టాలు
నాగార్జున స్కూల్ దగ్గర రోడ్డుపై అడ్డంకులు, ప్రజల ఆగ్రహం రోడ్డే పార్కింగ్‌గా మారింది, చందనగర్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): చందనగర్ మంజీర రోడ్డులో చెన్నారెడ్డి ఆసుపత్రి పక్కన కొందరు వ్యక్తులు రోడ్డును అక్రమంగా కబ్జా చేసి కర్రలు, తాళ్ళు ఏర్పాటు చేసి వాహనాలు నిలిపివేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే నిత్యం రద్దీగా ఉండే మంజీర రోడ్డు మరింతగా కిక్కిరిసి పోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. అదే విధంగా నాగార్జున స్కూల్ మేనేజ్మెంట్ వారు స్కూల్ కు అడ్డాగా భారీ కేడ్లు పెట్టీ రోడ్డున కబ్జా చేస్తున్నారు. సమీపంలో కూడా రోడ్డుపై అడ్డంగా కర్రలు, తాళ్ళు పెట్టి వాహనాలు వెళ్లకుండా రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతున్నా యి. ముఖ్యంగా పాఠశాల సమయం, ఆసుపత్రికి వచ్చే రోగులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఈ అక్రమ కబ్జాల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నారు. ఈ రోడ్డు మార్గంలో రోజువారీగా భారీ సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుండ టంతో, ఇటువంటి అక్రమ పార్కింగ్, రోడ్డు ఆక్రమణలు ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలు వెళ్లడానికీ ఇబ్బందులు ఎదురవు తున్నాయని వారు తెలిపారు. ఈ పరిస్థితిపై వెంటనే స్పందించి అక్రమంగా రోడ్డును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్డు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానిక ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని మంజీర రోడ్డులో సజావుగా ట్రాఫిక్‌ను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
