ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట
ఘనంగా సంక్రాంతి సంబరాలు
By Ram Reddy
On
లోకల్ గైడ్
కళాశాల ప్రిన్సిపాల్ డా సంతోష్ మహాత్మా సంబరాలను లాంఛనంగా ప్రారంభించగా విద్యార్థిని, విద్యార్థులూ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులూ బోధన బోధనేతర సిబ్బంది పతంగులు ఎగురవేసి సంబరాలకు స్వాగతo పలికారు.విద్యార్థులకు సంప్రదాయ పోటీలు రంగోలి, చిర్రగొనే, పులిమేక పచ్చీస్, అష్టాచెమ్మా, వైకుంఠపాళీ , కుర్చీ పరుగు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ మహాత్మా మాట్లాడుతూ సంప్రదాయాలను గౌరవించాలని పండగల ద్వార విజ్ఞానం వినోదం వ్యాప్తి చెందడం మన దేశ సంస్కృతిలోని గొప్పదనం అని తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ తన్నీరు సురేష్, అధ్యాపకులు, సంతోష్ కుమార్, జాడి శంకరయ్య, ప్రేమలత, నాగేశ్వర్, సంధ్యారాణి, కవిత, స్వప్న , కాంతయ్య బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులూ పాల్గోన్నారు.
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
