అత్తాపూర్ చిన్న అనంతగిరి శివాలయంలో మూడు రోజులపాటు శివరాత్రి మహోత్సవాలు.
14వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు.
రాజేంద్రనగర్ ఫిబ్రవరి 14, (లోకల్ గైడ్ ): చిన్న అనంతగిరి శివాలయంలో శ్రీ ప్రణవ భక్త సమాజము ఆధ్వర్యంలో 14వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రణవభక్త సమాజం అధ్యక్షులు మొండ్రా నర్సింహా, ప్రధాన కార్యదర్శి పుస్తకాల అశోక్ లు తెలిపారు. శనివారం ఉదయం 4:00 గంటలకు సుప్రభాత సేవ, గణపతి, ఆంజనేయస్వామి, పరమ శివునికి అభిషేకము, ఉమామహేశ్వరి అమ్మ వారికి అభిషేకము, కుంకుమార్చన, గణపతి హోమము, నవగ్రహ విశేష పూజలు శ్రీ ప్రణవ భక్త సమాజం అధ్యక్షులు మోండ్ర నర్సింహా ఆధ్వర్యంలో ప్రారంభమైంది. గణపతి హోమము తర్వాత పూర్ణాహుతి అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి స్తోత్ర భాష్యం హరినాథ్, కార్యదర్శులు కొండమీది హరినాథ్, రావుల గండయ్య, , ముఖ్య సలహాదారులు నారగూడెం మల్లారెడ్డి, కొలన్ సుభాష్ రెడ్డి, మ్యాడం రామేశ్వర్ రావు, మోండ్ర కొమురయ్య,మ్యాడం మధుసూదన్, ఎస్. జయానంద్ రెడ్డి, హోమం లో పాల్గొన్న దంపతులు ప్రచార కార్యదర్శులు సాబాద స్వప్న విజయ్ కుమార్, సింగాపురం శృతి మహేశ్వర్ రెడ్డి, మోండ్ర అయిలయ్య, పెంటల సుధాకర్ రెడ్డి, మ్యాడం రాము, కే. కిరణ్ చారి, కాకులారం కృష్ణ చెట్టిగారి చిన్న నరేందర్, సులిగే వెంకటేష్, కాడెం నర్సింగ్ రావు, కొంగళ్ల ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, సహదేవ రెడ్డి, సులిగే రమేష్, తుల్జగారి లలిత శ్రీరాములు, ఎల్. వెంకటేష్, కైల రవీందర్ రెడ్డి, గొరిగి రాజు, బంగి శ్రీనివాస్, పాత్లావత్ రమేష్ నాయక్, మోండ్ర రాజు, యం. బాలసుబ్రమణ్యం, యూ. శ్రీకాంత్, సోమవారం సురేందర్, తాటి రాజు, పవన్ భారతి చంద్రశేఖర్ దంపతులు, భక్తులు పాల్గొన్నారు.
