లింగాపురం గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ భవనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

లింగాపురం గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

చర్ల : లోకల్ గైడ్ :
లింగాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ భవనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ భవనం నిర్మించామని చెప్పారు. గ్రామంలో సమస్యల పరిష్కారం, పాలనా వ్యవహారాల నిర్వహణ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News