రిపబ్లిక్ డే సందర్భంగా నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా ‘మీ వార్త’ క్యాలెండర్ ఆవిష్కరణ

సీనియర్ మండల కమిటీ చేతుల మీదుగా మీ వార్త నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు.

రిపబ్లిక్ డే సందర్భంగా నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా ‘మీ వార్త’ క్యాలెండర్ ఆవిష్కరణ

చర్ల : లోకల్ గైడ్ :
చర్ల మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సీనియర్ మండల కమిటీ చేతుల మీదుగా మీ వార్త నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మీ వార్త పత్రిక సేవలను కొనియాడుతూ, ప్రజాసమస్యలను నిస్పక్షపాతంగా వెలుగులోకి తెస్తున్న పత్రికగా ప్రశంసించారు. ప్రత్యేకంగా మీ వార్త జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విధానాన్ని మెచ్చుకుంటూ, సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని తెలిపారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తల్ని ప్రజల వరకు చేరుస్తున్నారని పేర్కొన్నారు.
మీ వార్త పత్రిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం తేగడ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ అధికారి సెక్రటరీ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆధ్వర్యంలో మీ వార్త క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా చేసారు.

Tags:

About The Author

Latest News