సిట్ విచారణ పేరుతో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.

కొందుర్గు, జిల్లేడుచౌదరిగూడెం మండలాల బీఆర్ఎస్ నాయకుల మండిపాటు.

సిట్ విచారణ పేరుతో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.

రెండు మండలాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు. సిఎం దిస్టి బొమ్మను దగ్దం చేసిన బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు.

లోకల్ గైడ్ , జిల్లేడు చౌదరి గూడెం, కొందుర్గు.

 తెలంగాణ రాష్ట్రం సాధించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రెండు మండలాలకు చెందిన పార్టీ అద్యక్షులు సయ్యద్ హాపిస్, శ్రీదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ వైఖరీ పట్ల తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాని నిరసిస్తూ కొందుర్గు, జిల్లేడు చౌదరి గూడెం మండలాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మండల కేంద్రాలలో ధర్నా, నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు,తెలంగాణ జాతిపిత కెసిఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు.  కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్పే రోజు తొందరలోనే ఉందన్నారు. రాజకీయ కక్ష సాధింపులు కాంగ్రెస్ మానకపోతే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠము తప్పదని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సయ్యద్ హాపిస్, మోతిలాల్ నాయక్ , రాములు మానేయ్య, ప్రమోద్ పటేల్ , బంగారు రాములు,సి నరసింహులు, శేఖర్ , అక్రమ్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పడకంటి.వెంకటేష్ , అజ్మీర్ , నరేష్ ,జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ, పిఎసిఎస్ డైరెక్టర్ జగదీశ్వర్ గౌడ్,డిప్యూటీ సర్పంచ్ చంద్రశేఖర్, సున్నల శ్రీనివాస్,బీఆర్ఎస్ యువ నాయకుడు బోడంపాటి రవీందర్ రెడ్డి, రెడ్డి నర్సింలు, షుకుర్,గోపాల్ నాయక్,భీమాసేన, కలాం భాయ్, గణేష్,బాలరాజు,రవి గౌడ్, వాసూరి, పెద్ద ఎత్తున,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News