పాల్వంచలో ఘనంగా గ్రంథాలయ సభ్యత్వ నమోదు కార్యక్రమం
విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలి : చైర్మన్ పసుపులేటి వీరబాబు
పాల్వంచ : లోకల్ గైడ్ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం పాల్వంచ శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ సభ్యత్వ నమోదు కార్యక్రమం, గ్రంథాలయ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై, సభ్యత్వ నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు గౌరవ అతిథులుగా పాల్గొన్న 1వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి సీరం సుగుణ, స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ కరస్పాండెంట్ జి. భాస్కరరావు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయ సేవలను వినియోగించుకొని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనంతరం వార్డు కౌన్సిలర్ శ్రీమతి సీరం సుగుణ, లైబ్రేరియన్ కే మధుబాబును చైర్మన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ విద్యార్థులు, డాక్టర్ జ్యోత్స్న, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
