ఎన్ఎస్ఎస్ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు...
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మండలంలోని లంబడితండా గ్రామంలో నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక శిబిరంలో భాగంగా శనివారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు.ఎన్ఎస్ఎస్ యూనిట్-1,2ప్రోగ్రాం అధికారులు గజెల్లి మోహన్,ఎంఎ రేష్మ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కంటి వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు.కళ్లద్దాలు అవసరం ఉన్నవారికి,ఇతర వైద్యం అందాల్సిన వారికి తగిన సలహాలు,సూచనలు చేశారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి...
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విస్తరణ ఉపన్యాసం నిర్వహించారు.శాఖకు సంబంధించి ప్రజలకు అవసరమైన పలు సూచనలు,జాగ్రత్తలను వివరించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సిఐ జె ఇంద్రప్రసాద్,ఎస్సై ఎం వెంకటేష్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉంటామంటు గ్రామ ప్రజలు,ఎన్ఎస్ఎస్ వాలంటీర్ లతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి అధ్యాపకులు డాక్టర్ కూనురాజుల సమ్మక్క,కాలోజి సునీల్,పైడాకుల రవి,అల్లం తిరుపతి,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
